అక్రమ కేసులతో బెదిరించలేరంటూ కూటమి సర్కార్కు కాకాణి బహిరంగ సవాల్

రిపోర్టర్: sujith reddy స్థలం: పెళ్లకూరు

రాజకీయ కక్షసాధింపులో భాగంగానే మాజీ ఛైర్మన్ కామిరెడ్డి సత్యనారాయణ రెడ్డిపై కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు బనాయించి జైలుపాలు చేసిందని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి మండిపడ్డారు. తిరుపతి జిల్లా పెళ్లకూరులో ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించిన అనంతరం కాకాణి మాట్లాడుతూ ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తే భవిష్యత్తులో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ నాయకులకు పార్టీ అండగా ఉంటుందని ధైర్యం చెప్పారు.