శ్రీశైలంలో భక్తుల భారీ రద్దీ.. తాత్కాలికంగా ఆర్జిత సేవలు నిలిపివేత

రిపోర్టర్: విజయ్ స్థలం: నంద్యాల

శ్రీశైల క్షేత్రంలో భక్తుల రద్దీ భారీగా పెరిగింది. వరుస సెలవుల కారణంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చిన భక్తులతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడుతోంది. స్వామివారి దర్శనానికి రెండు గంటల సమయం పడుతోంది. భారీ రద్దీ దృష్ట్యా అధికారులు అభిషేకం, కుంకుమార్చన పూజలను తాత్కాలికంగా నిలిపివేశారు. భక్తులు క్యూలైన్లలో క్రమశిక్షణ పాటించి సిబ్బందికి సహకరించాలని ఆలయ వర్గాలు విజ్ఞప్తి చేశాయి.