మధ్యాహ్న భోజన సర్వేలో విశాఖపట్నం జిల్లాకు అగ్రస్థానం

రిపోర్టర్: రాము స్థలం: విశాఖపట్నం

ప్రభుత్వ పాఠశాలల్లో అమలు అవుతున్న మధ్యాహ్న భోజన పథకంపై రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన ఐవీఆర్ఎస్ సర్వే ఫలితాలు వెల్లడయ్యాయి. ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు వరకు సేకరించిన అభిప్రాయాల ప్రకారం విశాఖపట్నం జిల్లా ఎనభై శాతానికి పైగా సానుకూలతతో అగ్రస్థానంలో నిలిచింది. ఆహార నాణ్యతపై విద్యార్థులు, తల్లిదండ్రులు పూర్తి సంతృప్తి వ్యక్తం చేసినట్లు అధికారులు తెలిపారు. తక్కువ శాతం నమోదైన జిల్లాలపై ప్రత్యేక దృష్టి సారించి మెరుగైన వసతులు కల్పించనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది.