యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రైవేట్ స్లీపర్ బస్సు దగ్ధం తొమ్మిది మంది దుర్మరణం
రిపోర్టర్: విజయ్
స్థలం: Noida
యమునా ఎక్స్‌ప్రెస్‌వేపై ప్రయాణికులతో వెళ్తున్న ప్రైవేట్ ఏసీ స్లీపర్ బస్సులో అకస్మాత్తుగా మంటలు చెలరేగి తొమ్మిది మంది దుర్మరణం చెందారని అధికారులు తెలిపారు. దిల్లీలోని కాశ్మీర్ గేట్ నుండి మహోబా వెళ్తున్న ఈ బస్సులో ప్రయాణిస్తున్న తల్లిని రక్షించే ప్రయత్నంలో ఇంజనీర్ శశాంక్ గుప్తా ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా విషాదం నింపింది. క్యాబిన్లో మంటలు వ్యాపించిన సమయంలో ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారని, ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారని వెల్లడించారు.