రూపాయలు రెండు వేల కంటే ఎక్కువ యూపీఐ లావాదేవీలపై ఎండీఆర్‌ వర్తింపు

రిపోర్టర్: విజయ్ స్థలం: India

యూపీఐ చెల్లింపులపై 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుందన్న అంశంపై కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ స్పష్టతనిచ్చింది. రూ.2,000 కంటే తక్కువ విలువ కలిగిన వ్యాపారి చెల్లింపులకు ఎలాంటి ఛార్జీ ఉండదని, వ్యక్తిగత పీ2పీ లావాదేవీలకు కూడా ఎండీఆర్‌ వర్తించదని పేర్కొంది. నిర్దిష్ట వ్యాపారి చెల్లింపుల్లో రూ.2,000కు మించిన లావాదేవీలపై మాత్రమే 0.4 శాతం ఎండీఆర్‌ వర్తిస్తుందని, సాధారణ వినియోగదారులపై ఎలాంటి అదనపు భారం పడదని కేంద్రం స్పష్టం చేసింది.