సోషల్ మీడియాలో నా పేరుతో వచ్చే వార్తలు అవాస్తవం: కొండా సురేఖ
రిపోర్టర్: సునీల్
స్థలం: Telangana
సోషల్ మీడియాలో తన పేరుతో ప్రచారమవుతున్న వార్తలతో తనకు ఎలాంటి సంబంధం లేదని మంత్రి కొండా సురేఖ స్పష్టం చేశారు. ఫేక్ అకౌంట్ల ద్వారా జరుగుతున్న దుష్ప్రచారాన్ని ఆమె ఖండించారు. కేవలం తన అధికారిక సోషల్ మీడియా ఖాతాల ద్వారా వచ్చే సమాచారాన్ని మాత్రమే నమ్మాలని, అవాస్తవాలను నమ్మవద్దని ప్రజలకు, మీడియా మిత్రులకు ఆమె విజ్ఞప్తి చేశారు. తన అధికారిక ఖాతాల వివరాలను కూడా ఆమె వెల్లడించారు.