దుమ్ముగూడెంలో మీ సేవ ఆధార్ కేంద్రాలను తనిఖీ చేసిన అధికారులు
రిపోర్టర్: రాము
స్థలం: భద్రాద్రి కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా దుమ్ముగూడెం మండలంలోని మీ సేవ, ఆధార్ కేంద్రాలను ఈ-డిస్ట్రిక్ట్ మేనేజర్ సైదేశ్వరరావు మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రాల్లో అందుతున్న సేవలు, రుసుముల వసూళ్లు, పని వేళలను పరిశీలించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం నిర్ణీత రుసుములు మాత్రమే వసూలు చేయాలని, అదనపు వసూళ్లకు పాల్పడితే చర్యలుంటాయని నిర్వాహకులను హెచ్చరించారు.