అజిత్ కుమార్ సపోర్ట్ వల్లే దర్శకుడిగా నిలదొక్కుకున్నా: అధిక్ రవిచంద్రన్
రిపోర్టర్: రాజేష్
స్థలం: చెన్నై
తన రెండో సినిమా పరాజయం పాలై తీవ్ర నిరాశలో ఉన్న సమయంలో స్టార్ హీరో అజిత్ కుమార్ తనకు అండగా నిలిచారని దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తెలిపారు. ఏ హీరో కూడా తన కథ వినేందుకు ముందుకు రాని దశలో అజిత్ తనను గుర్తించి ప్రోత్సహించారని, నిర్మాత బోనీ కపూర్ కు పరిచయం చేశారని ఆయన గుర్తుచేసుకున్నారు. బధాయి హో తమిళ రీమేక్ లో నటించేందుకు కూడా అజిత్ అంగీకరించారని అధిక్ చెప్పారు.