హైదరాబాద్‌ను భారతీయ సినిమా ప్రధాన కూడలిగా మారుస్తాం: ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌ను భారతీయ సినిమా ప్రధాన కూడలిగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. శిల్పకళా వేదికలో జరిగిన బతుకమ్మ యంగ్ ఫిలిం మేకర్ ఛాలెంజ్ అవార్డ్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. యువ ఫిలిం మేకర్లు సృజనాత్మకతతో లఘు చిత్రాలు రూపొందించి నీటి సంక్షోభం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలపై ప్రజల్లో చైతన్యం తేవాలని పిలుపునిచ్చారు.