స్థానిక సంస్థల ఎన్నికలు: పోస్టల్ బ్యాలెట్ ముద్రణపై ఎస్ఈసీ కీలక మార్గదర్శకాలు

రిపోర్టర్: ప్రవీణ్ స్థలం: అమరావతి

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగనున్న పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల పోస్టల్ బ్యాలెట్ పత్రాల ముద్రణపై రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ఉత్తర్వులు జారీ చేసిందని అధికారులు తెలిపారు. అభ్యర్థుల పేర్ల కూర్పు, ఫార్మాట్తో పాటు మూడు కేటగిరీలుగా వర్గీకరించి ముద్రించాలని స్పష్టం చేశారు. బ్యాలెట్ పేపర్పై ఎలాంటి ఎన్నికల గుర్తులు ముద్రించకూడదని, అభ్యర్థి పేరు, పార్టీ పేరు మాత్రమే తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో ఉండాలని ఎస్ఈసీ పేర్కొన్నారు.