సీఆర్పీఎఫ్లో మళ్లీ ఆర్మీ ర్యాంకులు: లాన్స్ నాయక్ హోదాలపై కసరత్తు
రిపోర్టర్: కిరణ్
స్థలం: న్యూఢిల్లీ
దేశంలోనే అతిపెద్ద పారామిలిటరీ బలగమైన సీఆర్పీఎఫ్లో సుమారు ముప్పై ఏళ్ల క్రితం రద్దు చేసిన ఆర్మీ ర్యాంకులైన లాన్స్ నాయక్, నాయక్ హోదాలను తిరిగి ప్రవేశపెట్టే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు జాతీయ మీడియా పేర్కొన్నది. సిబ్బందికి పదోన్నతులు ఆలస్యం కావడం, విధుల్లో అసంతృప్తిని తగ్గించడం, అగ్నివీరులకు అవకాశాలు కల్పించడమే ఈ ప్రతిపాదన ఉద్దేశమని అధికారులు తెలిపారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా ఫీల్డ్ యూనిట్లలో సిబ్బంది అభిప్రాయాలను సేకరించాలని ప్రధాన కార్యాలయం ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.