యానాదుల దీనస్థితి: ముదిగేటులో కుటుంబాల సమస్యలను అడిగి తెలుసుకున్న బొబ్బేపల్లి

రిపోర్టర్: sankar p స్థలం: పొదలకూరు

నెల్లూరు జిల్లా పొదలకూరు మండలంలోని ముదిగేటు వద్ద నివసిస్తున్న ముప్పై సల్లా యానాది కుటుంబాల దీనస్థితిని సర్వేపల్లి జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు పరిశీలించారు. వారి వద్ద ఆధార్ మరియు రేషన్ కార్డులు లేకపోవడంతో పాటు పిల్లలు బడికి దూరమవుతున్న వైనాన్ని ఆయన స్వయంగా అడిగి తెలుసుకున్నారు. బాధితులకు త్వరితగతిన అవసరమైన ధ్రువపత్రాలు ఇప్పించి పిల్లలను బడులలో చేర్పిస్తామని ఆయన భరోసా ఇచ్చారు.