గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికపై కాంగ్రెస్ పార్టీ కసరత్తు

రిపోర్టర్: మహేష్ స్థలం: హైదరాబాద్

తెలంగాణలోని రెండు కీలక గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాల అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుందని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఈ నెల 29న ఢిల్లీలో జరగనున్న సీడబ్ల్యూసీ సమావేశానికి హాజరుకానున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పార్టీ హైకమాండ్తో చర్చించి తుది జాబితాను ఖరారు చేయనున్నారు. నల్గొండ–వరంగల్–ఖమ్మం మరియు హైదరాబాద్–రంగారెడ్డి–మహబూబ్ నగర్ స్థానాల కోసం పీసీసీ సమర్థులైన నేతల పేర్లతో కూడిన నివేదికను సిద్ధం చేసింది.