విజయవాడ కార్పొరేషన్‌లో 86కు పెరిగిన డివిజన్ల సంఖ్య
రిపోర్టర్: హరి
స్థలం: ఎన్టీఆర్ జిల్లా
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహాల్లో భాగంగా విజయవాడ నగర పాలక సంస్థలో డివిజన్ల సంఖ్యను ప్రభుత్వం పెంచింది. ఇప్పటివరకు ఉన్న 64 డివిజన్లకు మరో 22 జోడించడంతో మొత్తం సంఖ్య 86కు చేరింది. తూర్పు నియోజకవర్గంలో అత్యధికంగా 29 డివిజన్లు ఏర్పాటయ్యాయి. మేయర్ పదవికి తీవ్ర పోటీ నెలకొనడంతో రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది.