గూడూరులో జిల్లా కలెక్టర్ డా.ఏ.సిరి ఆకస్మిక పర్యటన మరియు తనిఖీలు

రిపోర్టర్: హరి స్థలం: తిరుపతి

గూడూరు మండలం పెంచికలపాడు గ్రామంలో జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి శుక్రవారం పర్యటించి వ్యవసాయం, విద్య రంగాలను పరిశీలించారు. రైతు పురుషోత్తం ఆచార్య పొలంలో బహుళ పంటల సాగు విధానాన్ని పరిశీలించిన ఆమె, జడ్పీ ఉన్నత పాఠశాలను సందర్శించి విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం గూడూరు పీహెచ్‌సీ, తహసీల్దార్ కార్యాలయం, బస్టాండ్, డంప్ యార్డులను ఆకస్మికంగా తనిఖీ చేసి అధికారులకు పలు సూచనలు చేశారు.