కేదార్తాల్ ట్రెక్కింగ్ మార్గంలో ఘోరం: మంచుచరియలు విరిగిపడి నలుగురు దుర్మరణం
రిపోర్టర్: అశోక్
స్థలం: Uttarkashi
ఉత్తరకాశీ జిల్లాలోని కేదార్తాల్ ట్రెక్కింగ్ మార్గంలో సంభవించిన హిమపాతంలో లక్నోకు చెందిన ఇద్దరు సోదరీమణులతో సహా నలుగురు ట్రెక్కర్లు ప్రాణాలు కోల్పోయినట్లు రక్షణ సిబ్బంది వెల్లడించారు. ఈ ప్రమాదంలో దీపిక వర్మ, వర్తిక వర్మ మృతి చెందగా, మిగతా ఇద్దరు మృతుల వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు తెలిపారు. సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయని, మృతదేహాలను వెలికితీసి తరలిస్తున్నట్లు అధికార వర్గాలు స్పష్టం చేశాయి.