తిరుమలలో ఆరు రోజుల పాటు ఎస్‌ఎస్‌డీ టోకెన్ల రద్దు

రిపోర్టర్: అశోక్ స్థలం: తిరుపతి

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి తిరుపతిలో జారీ చేసే ఎస్‌ఎస్‌డీ టోకెన్లను సోమవారం నుంచి ఈ నెల 19 వరకు తితిదే నిలిపివేసింది. బ్రహ్మోత్సవాల నేపథ్యంలో భక్తులను నేరుగా తిరుమల క్యూలైన్లలోకి అనుమతించనున్నారు. ముందస్తు సమాచారం లేకపోవడంతో టోకెన్ల కోసం వచ్చిన భక్తులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. వరుస సెలవులతో పుణ్యక్షేత్రానికి భక్తుల రద్దీ భారీగా పెరిగింది.