విద్యార్థుల ఒత్తిడి తగ్గించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలన్న లోకేశ్
రిపోర్టర్: సురేష్
స్థలం: అమరావతి
విద్యార్థుల్లో మానసిక ఒత్తిడిని తగ్గించి ఫలితాల్లో మెరుగైన ప్రదర్శన కనబరిచేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేయాలని మంత్రి నారా లోకేశ్ అధికారులను ఆదేశించారు. అమరావతిలో విద్యారంగంపై నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షలో ఆయన మాట్లాడుతూ, పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల్లో తొంభై శాతం ఫలితాలే లక్ష్యంగా పనిచేయాలన్నారు. మిషన్ మోడ్లో అవగాహన కల్పించేందుకు కేర్ ఏపీ టూల్ పైలట్ ప్రాజెక్టును అమలు చేయాలని సూచించారు.