ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికలు: కూటమి ఖాతాలో భారీ విజయం నమోదు
రిపోర్టర్: అశోక్
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపాలిటీ ఎన్నికల్ లో తెలుగుదేశం పార్టీ నేతృత్వంలోని కూటమి ఘన విజయం సాధించిందని కౌంటింగ్ అధికారులు తెలిపారు. చైర్పర్సన్ అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ నేత డాక్టర్ బొమ్మిరెడ్డి షకీలా తన సమీప ప్రత్యర్థిపై భారీ మెజారిటీతో గెలుపొందారు. మొత్తం ఇరవై ఎనిమిది వార్డుల్ లో ఎన్డీయే కూటమి పదహారు స్థానాలను కైవసం చేసుకుని మున్సిపల్ పీఠాన్ని దక్కించుకుంది. దీంతో ఆత్మకూరు పట్టణంలో కూటమి శ్రేణులు పెద్ద ఎత్తున విజయోత్సవ సంబరాలు జరుపుకున్నారు.