మహేష్ బాబు, రాజమౌళి సహా పలువురు ప్రముఖులకు ఎస్ఐఆర్ నోటీసులు

రిపోర్టర్: వెంకట్ స్థలం: తెలంగాణ

తెలంగాణలో జరుగుతున్న ఓటర్ల జాబితా ప్రత్యేక పోలింగ్ సవరణ ప్రక్రియలో భాగంగా టాలీవుడ్ ప్రముఖులు ఎస్.ఎస్. రాజమౌళి, మహేష్ బాబు, వెంకటేశ్, సమంత, విజయ్ దేవరకొండతో పాటు పలువురు క్రీడాకారులకు ఎన్నికల సంఘం నోటీసులు జారీ చేసింది. ఎన్యూమరేషన్ పత్రాల్లో వివరాల వ్యత్యాసాల కారణంగా ఈ నోటీసులు పంపినట్లు అధికారులు తెలిపారు. స్వయంగా లేదా ప్రతినిధుల ద్వారా విచారణకు హాజరై తప్పులను సవరించుకోవాలని సూచించారు.