దళితులను అవమానించిన వారిపై వెంటనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయాలి.. చిలుక రాజనర్సు డిమాండ్
రిపోర్టర్: PRASAD
స్థలం: బెల్లంపల్లి
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని అంబేడ్కర్ చౌరస్తాలో మాదిగ హక్కుల దండోరా ఆధ్వర్యంలో బుధవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ చిలుక రాజనర్సు మాట్లాడుతూ, దళితులు నిరసన తెలిపిన రోడ్లను పసుపునీళ్లు, పాలతో శుద్ధి చేసిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఘటన కుల వివక్షకు పరాకాష్ట అని తీవ్రంగా ఖండించారు. పట్టణ అధ్యక్షుడు ఎనగందుల శివాజీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు సంఘం నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.