పాలకొండ ఎన్నికల్లో జంట విజయం సాధించి అదరగొట్టిన దంపతులు

రిపోర్టర్: Alfa News Desk స్థలం: పాలకొండ

భార్యాభర్తలిద్దరూ ప్రజాప్రతినిధులుగా ఎన్నిక కావడం పాలకొండ నగర పంచాయతీ ఎన్నికల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. జనసేన పార్టీ తరఫున ఎన్నికల బరిలో నిలిచిన ఈ దంపతులు ఇద్దరూ విజయం సాధించి తమ రాజకీయ ప్రస్థానంలో మరో అడుగు ముందుకేశారు. పాలకొండ నగర పంచాయతీలోని పదకొండో వార్డు నుంచి భర్త జనసేన పార్టీ అభ్యర్థిగా పోటీ చేసి ఘన విజయం సాధించారు.