ములుగు జిల్లాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి సీతక్క

రిపోర్టర్: కృష్ణ స్థలం: ములుగు

ములుగు జిల్లాలోని నల్లగుంట గ్రామంలో సిసి రోడ్ల నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసినట్లు మంత్రి, ములుగు ఎమ్మెల్యే దనసరి అనసూయ (సీతక్క) వెల్లడించారు. అలాగే పెద్దపూ లబ్ధిదారులకు నూతన స్మార్ట్ రేషన్ కార్డులను పంపిణీ చేసినట్లు ఆమె తెలిపారు. లక్ష్మీదేవిపేటలో వివో భవనాన్ని ప్రారంభించామని పేర్కొన్నారు. ప్రజా పాలనలో ప్రతి గ్రామం ప్రగతి దిశగా అడుగులు వేస్తోందని, ప్రజల సంక్షేమం కోసం తమ ప్రభుత్వం నిరంతరం శ్రమిస్తోందని ఆమె స్పష్టం చేశారు.