బీఆర్ఎస్ నేత సట్టు తిరుమలేష్ను అభినందించిన మాజీ మంత్రి హరీష్ రావు

రిపోర్టర్: K.Shekhar స్థలం: రాజాపేట

రాజాపేట మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సట్టు తిరుమలేశును మాజీ మంత్రి హరీష్ రావు ప్రత్యేకంగా అభినందించారు. మోటకొండూరులో జరిగిన సమావేశంలో ఆయన సేవలను ప్రశంసిస్తూ శాలువాతో సత్కరించారు. పార్టీ అభివృద్ధికి పాటుపడుతూ ప్రభుత్వ లోపాలను ఎండగడుతున్న ఆయన పనితీరు ఆదర్శప్రాయమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి తదితరులు పాల్గొని అభినందనలు తెలిపారు.