'సొంత పార్టీవారైనా ఉపేక్షించలేదు': మంత్రి నారా లోకేశ్ ఫైర్
రిపోర్టర్: గోపి
స్థలం: నెల్లూరు
నెల్లూరు జిల్లా కోవూరులో టీడీపీ కేడర్‌తో నిర్వహించిన సమావేశంలో మంత్రి నారా లోకేశ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ భారతిపై సోషల్ మీడియాలో అనుచిత పోస్టులు పెట్టిన వారిపై సొంత పార్టీవారైనా సరే వెనుకాడకుండా కఠిన చర్యలు తీసుకుని జైలుకు పంపామని స్పష్టం చేశారు. మహిళల గౌరవానికి భంగం కలిగించే సంస్కృతిని టీడీపీ ఎప్పుడూ సమర్థించదని తేల్చిచెప్పారు. ఇదే సమయంలో డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా తెలియని వారు కూడా ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని ఆయన ప్రతిపక్ష నేతలపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.