పక్కోడి గురించి ఆలోచిస్తే ఇప్పటికి ఆత్మహత్య చేసుకోవాలింటూ బండ్ల గణేశ్ వ్యాఖ్యలు
రిపోర్టర్: మహేష్
స్థలం: హైదరాబాద్
జీవితంలో ఎదుగుదలపైనే దృష్టి పెట్టాలని, పక్కవాళ్ల గురించి ఆలోచిస్తే ఇప్పటికి ఐదు వందల సార్లు ఆత్మహత్య చేసుకోవాల్సి వచ్చేదని నిర్మాత, నటుడు బండ్ల గణేశ్ స్పష్టం చేశారు. 'తెల్ల కాగితం' సినిమా ప్రీరిలీజ్ వేడుకలో ఆయన మాట్లాడుతూ, తనపై నిత్యం జరిగే ట్రోల్స్, విమర్శలను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. దర్శకుడు రమేశ్ బండ్రెడ్డి పడిన కష్టాలపై స్పందిస్తూ, మనం మన గురించే ఆలోచించుకోవాలని, పక్కోడు మన గురించి తిట్టినా మనం పైకి చేరుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.