విజయవాడ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ కు సర్వం సిద్ధం: లయోలా కళాశాలలో ఏర్పాట్లు పూర్తి
రిపోర్టర్: వెంకట్
స్థలం: విజయవాడ
విజయవాడ నగరపాలిక పరిధిలోని ఎనుబది ఆరు డివిజన్ల ఓట్ల లెక్కింపునకు లయోలా కళాశాలలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఎన్నికల అధికారులు తెలిపారు. బ్యాలెట్ పత్రాల ద్వారా జరిగిన ఈ ఎన్నికల్ లో కౌంటింగ్ ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించేందుకు అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. తొలుత పోస్టల్ బ్యాలెట్ పత్రాలను లెక్కించనున్నట్లు వెల్లడించారు. ఈ లెక్కింపు ప్రక్రియ కోసం కౌంటింగ్ కేంద్రంలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు కల్పించినట్లు అధికారులు స్పష్టం చేశారు.