కావలిలో మద్యం దుకాణంలో దొంగనోటుతో యువకుడు పరారీ
రిపోర్టర్: మహేష్
స్థలం: కావలి
కావలి పట్టణంలోని ఉదయగిరి రోడ్డులో ఉన్న మద్యం దుకాణంలో ఓ యువకుడు రూ.500 నకిలీ నోటును చలామణి చేసేందుకు యత్నించాడు. మద్యం సీసా కొనుగోలుకు ఆ నోటు ఇవ్వగా, అనుమానం వచ్చిన నిర్వాహకుడు పరిశీలించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వచ్చేలోగా సదరు యువకుడు పరారయ్యాడు. సీసీ కెమెరాల ఆధారంగా ఆర్టీసీ బస్టాండ్ ప్రాంతానికి చెందిన వ్యక్తిగా భావిస్తూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.