ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశంలో వింత కాంతులు సంచలనం

రిపోర్టర్: సురేష్ స్థలం: Tehran

ఇరాన్ రాజధాని టెహ్రాన్ ఆకాశంలో రాత్రి సమయంలో కొన్ని వింత కాంతులు కదలడం సోషల్ మీడియాలో తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. చీకటి ఆకాశంలో బహుళ లైట్లతో కదులుతున్న ఆ వస్తువు డ్రోన్, విమానం లేదా యూఎఫ్‌ఓ అయి ఉండొచ్చని నెటిజన్లు రకరకాలుగా చర్చిస్తున్నారు. అయితే ఈ అజ్ఞాత వస్తువుపై ఇరాన్ అధికారులు ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. అమెరికాతో ఉద్రిక్తతల నడుመ ఈ వింత కాంతులు కనిపించడం ఆసక్తికరంగా మారింది.