భారత మార్కెట్లో కొత్త BMW 7 సిరీస్ విడుదల
రిపోర్టర్: విజయ్
స్థలం: భారతదేశం
భారత మార్కెట్లో సరికొత్త BMW 7 సిరీస్ కార్లను జర్మన్ తయారీ సంస్థ విడుదల చేసింది. దీని ప్రారంభ ధర రూ.1.95 కోట్లుగా ఉంది. చెన్నై ప్లాంట్‌లోనే BMW i7 స్థానిక ఉత్పత్తిని కంపెనీ ప్రకటించింది. జర్మనీ తర్వాత ఈ ఎలక్ట్రిక్ లగ్జరీ సెడాన్‌ను తయారుచేసే ఏకైక దేశంగా భారత్ నిలిచింది. శక్తివంతమైన ఇంజిన్, అడ్వాన్స్‌డ్ ఫీచర్లు, అద్భుతమైన బ్యాటరీ రేంజ్‌తో ఈ వాహనాలు మార్కెట్లోకి వచ్చాయి.