'చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు': విజయనగరం ఎస్పీ వార్నింగ్

రిపోర్టర్: వెంకట్ స్థలం: Vizianagaram

విజయనగరం జిల్లాలో చట్టాన్ని ఉల్లంఘించి దుశ్చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు ఉంటాయని జిల్లా ఎస్పీ ఎ.ఆర్.దామోదర్ హెచ్చరించారు. శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటామని, నేరాలకు పాల్పడేవాళ్లను ఉపేక్షించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు.