విజయవాడలో సురక్షితంగా విమానం దిగానన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్
రిపోర్టర్: రాము
స్థలం: విజయనగరం
భారీ వర్షాలు మరియు ప్రతికూల వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో భోగాపురం చేరాల్సిన మంత్రి కొండపల్లి శ్రీనివాస్ విజయవాడలో విమానం దిగారు. నాగ్పూర్ మీదుగా బెంగళూరు చేరుకుని, అక్కడి నుంచి మరో విమానంలో విజయవాడకు సురక్షితంగా చేరుకున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను తెదేపా క్యాంపు కార్యాలయంలో ఉన్నానని, తన కోసం కుటుంబసభ్యులు, కార్యకర్తలు ఎలాంటి ఆందోళన చెందవద్దని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.