మధ్యప్రదేశ్ లో ఏడు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
రిపోర్టర్: రమేష్
స్థలం: మధ్యప్రదేశ్
మధ్యప్రదేశ్ లోని హోమ్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏడు వేల ఐదు వందల పోలీస్ కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి ఎంపీఈఎస్బీ అధికారికంగా నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ ఉద్యోగాల కోసం అర్హులైన అభ్యర్థులు సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అక్టోబర్ ఆరు వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని బోర్డు వెల్లడించింది.