హైదరాబాద్‌లో గంజాయి గుట్టురట్టు: వృద్ధురాలి నెట్‌వర్క్‌లో అరవై ఆరు మందికి పాజిటివ్
రిపోర్టర్: కృష్ణ
స్థలం: హైదరాబాద్
హైదరాబాద్‌లోని ఫతేనగర్‌లో డ్రగ్స్ విక్రయిస్తున్న డెబ్బై ఐదేండ్ల వృద్ధురాలు షేక్ జతేన్బీని ఈగల్ ఫోర్స్ అధికారులు అరెస్ట్ చేసినట్టు పోలీసులు వెల్లడించారు. ఆమె సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా నిర్వహించిన విచారణలో భారీ గంజాయి నెట్వర్క్ బట్టబయలైంది. డ్రగ్స్ పరీక్షలు నిర్వహించగా డెబ్బై మందిలో అరవై ఆరుగురికి పాజిటివ్‌గా తేలిందని, ఇందులో ముగ్గురు మైనర్లు ఉన్నారని అధికారులు స్పష్టం చేశారు. నిందితురాలపై గతంలోనూ ఏడు కేసులు ఉన్నట్టు పోలీసులు తెలిపారు.