తీవ్ర అలర్ట్: మురసు తుపానుపై ఉన్నతాధికారులు మరియు కలెక్టర్లతో సీఎం సమీక్ష

రిపోర్టర్: విజయ్ స్థలం: అమరావతి

మురసు తుపాను ప్రభావం తక్కువగానే ఉండొచ్చని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి ఉన్నతాధికారులు, జిల్లా కలెక్టర్లతో ఆయన సమీక్ష నిర్వహించారు. తుపాను తీరం దాటే వరకు అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండాలని, ప్రాణ, ఆస్తినష్టం జరగకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. వర్షాలను సద్వినియోగం చేసుకుని రిజర్వాయర్లను నింపాలని ఆదేశాలు జారీ చేశారు.