రాహుల్ గాంధీకి మద్దతుగా రహదారిపై కదంతొక్కిన అచ్చంపేట కాంగ్రెస్ శ్రేణులు

రిపోర్టర్: dumarla bhaskar senier journalist స్థలం: అచ్చంపేట

ఢిల్లీలోని రామ్ లీలా మైదానంలో రాహుల్ గాంధీ నిర్వహించిన ఆందోళనకు మద్దతుగా అచ్చంపేట నియోజకవర్గంలోని కాంగ్రెస్ శ్రేణులు శ్రీశైలం హైదరాబాద్ ప్రధాన రహదారి హాజీపూర్ వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. చీఫ్ ఎలక్షన్ కమిషనర్ పై కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని తమ నిరసనను వ్యక్తం చేశారు.