విశ్వవిద్యాలయ భవనంపై నుండి దూకి ఎంబీఏ విద్యార్థిని ఆత్మహత్య
రిపోర్టర్: కిరణ్
స్థలం: జైపూర్
జైపూర్ లోని ఒక ప్రైవేట్ విశ్వవిద్యాలయంలో ఎంబీఏ చదువుతున్న ఇరవై మూడు ఏళ్ల యశస్వి రోహిల ఆరవ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. పరీక్ష హాల్ లోకి వెళ్లే ముందు ఆమెకు ఫోన్ కాల్ వచ్చినట్లు అధికారులు పేర్కొన్నారు. తోటి విద్యార్థులు వారించే ప్రయత్నం చేసినప్పటికీ ఆమె క్రిందికి దూకేశారు. తీవ్రంగా గాయపడిన ఆమెను ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందారని వైద్యులు స్పష్టం చేశారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.