శ్రీకాకుళం కార్పొరేషన్ రిజర్వేషన్లు ఖరారు కావడంతో రాజుకున్న రాజకీయ వేడి
రిపోర్టర్: JR RAO
స్థలం: శ్రీకాకుళం
శ్రీకాకుళం నగరపాలక సంస్థలోని అరవై డివిజన్లకు రిజర్వేషన్లు ఖరారు చేస్తూ జిల్లా యంత్రాంగం బుధవారం గెజిట్ విడుదల చేసింది. ఎస్టీ-ఒకటి, ఎస్సీ-ఆరు, బీసీ-ఇరవై మూడు, జనరల్ మహిళల-పదహారు, జనరల్-పద్నాలుగు డివిజన్లు కేటాయించారు. రిజర్వేషన్లు ఖరారు కావడంతో నగరంలో ఎన్నికల సందడి మొదలైంది. ఆశావహులు అభ్యర్థిత్వంపై రాజకీయ సమీకరణాలు ప్రారంభించారు.