నెల్లూరు ఐటీడీఏను షెడ్యూల్డ్ జాబితాలోకి చేర్చాలన్న సోమిరెడ్డి

రిపోర్టర్: sujith reddy స్థలం: నెల్లూరు అర్బన్

నెల్లూరు జిల్లాలో మైదాన ప్రాంతాల్లోని గిరిజనులు, చల్లా యానాదులు అత్యంత దుర్భర పరిస్థితుల్లో జీవనం సాగిస్తున్నారని సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. నెల్లూరులోని ఐటీడీఏ కార్యాలయంలో జరిగిన 11వ జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నెల్లూరు ఐటీడీఏను షెడ్యూల్డ్ జాబితాలోకి చేర్చాలని డిమాండ్ చేశారు. పేద గిరిజనుల ఆస్తులను మోసపూరితంగా కొట్టేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.