'కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్న చంద్రబాబు': వారణాసిలో ఏపీ సీఎం పర్యటన
రిపోర్టర్: సతీష్
స్థలం: వారణాసి
ఏపీ సీఎం చంద్రబాబు వారణాసిలో పర్యటించారు. సేవా సంకల్ప్ అభియాన్‌లో పాల్గొనేందుకు వెళ్లిన ఆయన, కేంద్రమంత్రులు రాజ్‌నాథ్‌సింగ్, పంకజ్ చౌదరి, చిరాగ్ పాసవాన్, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో కలిసి కాశీ విశ్వనాథుడిని దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం, కేంద్రమంత్రులతో కలిసి ప్రసాదాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని ఆధ్యాత్మిక పర్యటనను కొనసాగించారు.