విజయనగరంలో ఘనంగా ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు
రిపోర్టర్: BHAVANI THADI
స్థలం: విజయనగరం
విజయనగరం అయ్యన్నపేటలోని మదర్ థెరిసా కిడ్స్ స్కూల్లో ఉపాధ్యాయ దినోత్సవం ఘనంగా జరిగింది. ప్రిన్సిపల్ త్యాడ ప్రసాద్ పట్నాయక్ ఆధ్వర్యంలో సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు.
ఈ సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత కొల్లి సత్యం, రక్తదాత బొడ్డేపల్లి రామకృష్ణారావు, వేణుగోపాలంలను పాఠశాల యాజమాన్యం ఘనంగా సన్మానించింది. కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.