స్మార్ట్ఫోన్ వినియోగదారులకు షాక్: భారత్లో ఏఐ ప్లస్ ఫోన్ల ధరల పెంపు

రిపోర్టర్: గోపి స్థలం: New Delhi

భారత్లో ప్రముఖ స్మార్ట్ఫోన్ తయారీ సంస్థ ఏఐ ప్లస్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు ఆ కంపెనీ వెల్లడించింది. పెరుగుతున్న విడిభాగాల ఖర్చుల కారణంగా పలు బడ్జెట్ మరియు మిడ్-రేంజ్ మోడళ్ల ధరలను పెంచుతున్నట్లు కంపెనీ ప్రకటించింది. నవంబర్ 15వ తేదీ నుంచి ఈ కొత్త ధరలు అమల్లోకి రానున్నాయని, మోడల్ను బట్టి వెయ్యి నుంచి మూడు వేల రూపాయల వరకు ధరలు పెరిగే అవకాశం ఉందని కంపెనీ వర్గాలు స్పష్టం చేశాయి.