మంత్రి లోకేష్ కృషితో కార్పొరేట్ స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలు
రిపోర్టర్: విజయ్
స్థలం: అమరావతి
ఐదేళ్ల గత పాలనలో అభివృద్ధికి నోచుకోక పాడుబడ్డ ప్రభుత్వ పాఠశాలలు నేడు మంత్రి నారా లోకేష్ ప్రత్యేక కృషితో కార్పొరేట్ స్కూళ్లను తలదన్నేలా మారుతున్నాయి. కొత్తగా నిర్మించిన స్కూళ్లను చూస్తే అసలివి ప్రభుత్వ పాఠశాలలేనా అనే ఆశ్చర్యం కలుగుతోంది. నిబద్ధతతో పనిచేస్తే ఫలితాలు ఎలా ఉంటాయో కూటమి ప్రభుత్వ పాలనలో మారుతున్న విద్యా సంస్థల తీరు స్పష్టం చేస్తోంది.