యువతలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ ట్రెండ్: సర్జరీకి ముందు వైద్యులు చెప్పే ముఖ్యమైన నిజాలు

రిపోర్టర్: శివ స్థలం: హైదరాబాద్

చిన్న వయసులోనే జుట్టు రాలే సమస్య ఎదురవుతున్న సమయంలో హెయిర్ ట్రాన్స్ప్లాంట్ చేయించుకోవడంపై నిపుణులు కీలక హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ప్రతి జుట్టు రాలే సమస్యకు సర్జరీ ఒక్కటే పరిష్కారం కాదని, ఒత్తిడి, పోషకాహార లోపాలు లేదా జన్యుపరమైన కారణాలను ముందుగా గుర్తించాలని వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ముందస్తు ఆలోచన లేకుండా ట్రాన్స్ప్లాంట్ చేయించుకుంటే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదురవుతాయని, తల వెనుక ఉండే పరిమితమైన కుదుళ్లను కాపాడుకోవడం చాలా ముఖ్యమని వైద్య నిపుణులు వెల్లడించారు.