చెన్నరాజుపోడులో ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని పోటెత్తిన వైయస్సార్సీపీ శ్రేణులు
రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్
స్థలం: ఓబులవారిపల్లి
తిరుపతి జిల్లా ఓబులవారిపల్లి మండలం చెన్నరాజుపోడులో వైయస్సార్సీపీ అభ్యర్థులు బండారు స్వప్న, గూడూరు సుజాత ఇంటింటి ప్రచారం నిర్వహించారు. సుంకేసుల రఫీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో నాయకులు ఫ్యాన్ గుర్తుకు ఓటేయాలని కోరారు. తమను గెలిపిస్తే గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని అభ్యర్థులు స్పష్టం చేశారు. ఈ ఎన్నికల ప్రచార కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు.