నగరి: 17 మందికి సీఎం సహాయ నిధి చెక్కుల పంపిణీ

రిపోర్టర్: సిటిజెన్ పోస్ట్ స్థలం: నగరి

నగరి నియోజకవర్గంలోని నిండ్ర, విజయపురం మండలాలకు చెందిన 17 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కులను ఎమ్మెల్యే గాలి భాను ప్రకాష్ అందజేశారు. మొత్తం 7 లక్షల 67 వేల 307 రూపాయల విలువైన చెక్కులను ఆయన పంపిణీ చేశారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రభుత్వం పేద ప్రజల ఆరోగ్య సమస్యల పట్ల అండగా ఉంటోందని పేర్కొన్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న బాధితులకు ఈ సహాయం ఎంతో ఉపశమనం కలిగిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.