తెలుగు రాష్ట్రాల్లో కలకలం: అనంతపురంలో బర్డ్ ఫ్లూ కలకలం
రిపోర్టర్: హరి
స్థలం: అనంతపురం
తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ మళ్లీ వణుకు పుట్టిస్తోందని, తెలంగాణలోని ఆదిలాబాద్ నుంచి అనంతపురం జిల్లాకు దిగుమతి చేసుకున్న కోళ్లలో ఏవియన్ ఇన్ఫ్లుఎంజా వైరస్ పంజా విసరడంతో కేవలం కొన్ని రోజుల వ్యవధిలోనే ఏకంగా రెండు వేల ఐదు వందల కోళ్లు మృత్యువాత పడ్డాయని పశుసంవర్ధక శాఖ జాయింట్ డైరెక్టర్ ప్రేమ్చంద్ తెలిపారు. ఈ ఘటనతో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లోని పౌల్ట్రీ పరిశ్రమలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది.