మలక్‌పేటలో పోలీస్ కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ ఆత్మహత్య
రిపోర్టర్: రాము
స్థలం: హైదరాబాద్
తెలంగాణ పోలీస్ శాఖలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. హైదరాబాద్‌లోని మలక్‌పేట్ ముసారాంబాగ్ శాలివాహన నగర్‌కు చెందిన పోలీస్ కానిస్టేబుల్ ముత్తె చంద్రశేఖర్ (35) ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అంబర్‌పేట్ హెడ్‌క్వార్టర్స్‌లో రైటర్‌గా విధులు నిర్వహిస్తున్న ఆయన, గత అర్ధరాత్రి ఓ యువతికి వీడియో కాల్ చేసి తాను ఆత్మహత్య చేసుకుంటున్నట్లు తెలిపాడు. అప్రమత్తమైన ఆ యువతి చైతన్యపురి పోలీసులకు సమాచారం అందించగా, వారు మలక్‌పేట్ పోలీసులను అప్రమత్తం చేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.