బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచందర్ రావు మీడియా సమావేశం
రిపోర్టర్: సునీల్
స్థలం: New Delhi
న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రామచందర్ రావు మీడియా సమావేశాన్ని నిర్వహించి మాట్లాడారు. ఈ సమావేశంలో ఆయన రాష్ట్ర రాజకీయాలు, పార్టీ విధానాలు అలాగే భవిష్యత్తు కార్యాచరణపై కీలక అంశాలను ప్రస్తావించారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, ప్రజా సమస్యలపై బీజేపీ పోరాట తీరును వివరించారు. ఎప్పటికప్పుడు ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తామని స్పష్టం చేశారు.