శ్రీశైలంలో అక్టోబర్ నెల దర్శన టికెట్లు విడుదల

రిపోర్టర్: ప్రసాద్ స్థలం: శ్రీశైలం

శ్రీశైల శ్రీ మల్లికార్జున స్వామివారి అక్టోబర్ నెల దర్శన, ఆర్జిత సేవల టికెట్లను విడుదల చేసినట్లు పాలకమండలి ఛైర్మన్ పోతుగుంట రమేష్ నాయుడు తెలిపారు. మొత్తం టికెట్లలో ఎనభై శాతం మనమిత్ర వాట్సాప్ నంబర్ ద్వారా, మిగిలిన ఇరవై శాతం అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకోవచ్చని ఆయన స్పష్టం చేశారు. అక్టోబర్ పదకొండు నుంచి ఇరవై వరకు దసరా మహోత్సవాల నేపథ్యంలో పలు ఆర్జిత సేవలు, స్పర్శదర్శనాల్లో మార్పులు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.